NewsBuzz, Rain Updates :- బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మరింత తీవ్రమై నేడు వాయుగుండంగా మారే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ (SDMA) తెలిపింది. దీని ప్రభావంతో రాగల మూడు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.
ఆంధ్రప్రదేశ్‌లో వర్షాల తీవ్రత :- వాయుగుండం ప్రభావం వల్ల ప్రధానంగా దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయని అంచనా వేస్తున్నారు. నేడు మన్యం, అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం, కోనసీమ, పశ్చిమ గోదావరి, మార్కాపురం, ప్రకాశం, నెల్లూరు, నంద్యాల, కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని SDMA వెల్లడించింది. ప్రజలు, ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
తెలంగాణలో ఐఎంబీ (IMD) హెచ్చరికలు :-అటు తెలంగాణ రాష్ట్రంలో కూడా వాయుగుండం ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. ఈ రోజు రాజధాని హైదరాబాద్‌తో పాటు రంగారెడ్డి, యాదాద్రి భువనగిరి, మేడ్చల్ మల్కాజిగిరి, నల్లగొండ, సూర్యాపేట జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (IMD) పేర్కొంది.కురుస్తున్న వర్షాల దృష్ట్యా అత్యవసరం అయితే తప్ప బయటకు రాకూడదని, విద్యుత్ స్తంభాలు మరియు పొంగిపొర్లుతున్న వాగులు, వంకల పట్ల జాగ్రత్తగా ఉండాలని వాతావరణ శాఖ మరియు విపత్తుల నిర్వహణ శాఖ హెచ్చరించాయి.