NB
News Buzz యాప్‌లో చూడండి సులభమైన స్వైపింగ్ & లైవ్ అప్‌డేట్స్
యాప్ డౌన్‌లోడ్ చేయండి
29/11/2026
పోల్స్ (Polls)
హోమ్ ఆసక్తికరమైన నిజాలు ఎలినినో ఎఫెక్ట్ : విద్యుత్ విలయం.. మస్త్ జాగ్రత్త సుమీ!

ఎలినినో ఎఫెక్ట్ : విద్యుత్ విలయం.. మస్త్ జాగ్రత్త సుమీ!

ఆసక్తికరమైన నిజాలు By News Buzz Oct 12, 2026 131 Views
ఎలినినో ఎఫెక్ట్ : విద్యుత్ విలయం.. మస్త్ జాగ్రత్త సుమీ!

న్యూస్ బజ్, అక్టోబర్ 12 :- 

ప్రకృతి వైపరీత్యాలు, వాతావరణ మార్పుల ప్రభావం మన దైనందిన జీవితంపై స్పష్టంగా కనిపిస్తోంది. ప్రస్తుతం 'సూపర్ ఎల్ నినో' దెబ్బకు తెలుగు రాష్ట్రాల్లో విద్యుత్ సంక్షోభం తలెత్తే ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. వర్షాభావ పరిస్థితుల కారణంగా మన ప్రధాన ప్రాజెక్టులైన శ్రీశైలం, నాగార్జున సాగర్, శ్రీరాంసాగర్ వంటి కీలక జలాశయాల్లో నీటి మట్టాలు సగం కూడా నిండకపోవడం ఆందోళన కలిగిస్తోంది. జలాశయాల్లో నీటి నిల్వలు అడుగంటడంతో జలవిద్యుత్ ఉత్పత్తి తీవ్రంగా నిలిచిపోయే ప్రమాదం ఏర్పడింది. ఒకవైపు విద్యుత్ ఉత్పత్తి భారీగా తగ్గిపోతుంటే, మరోవైపు భానుడి భగభగలకు మరియు ఎండల తీవ్రతకు విద్యుత్ డిమాండ్ రోజురోజుకూ రికార్డు స్థాయిలో పెరుగుతోంది. రాబోయే ఫిబ్రవరి నెల వరకు ఈ ఎల్ నినో ప్రభావం కొనసాగుతుందని వాతావరణ మరియు విద్యుత్ శాఖ నిపుణులు హెచ్చరిస్తున్నారు. నీటి లభ్యత తగ్గడం, ఉత్పత్తి తగ్గి డిమాండ్ పెరగడంతో రాబోయే రోజుల్లో కరెంట్ కోతలు అనివార్యమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.

ఈ సంక్షోభ పరిస్థితులను అధిగమించాలంటే ముందస్తు జాగ్రత్తే ఏకైక మార్గం. అధికారులు చర్యలు తీసుకునే వరకు ఆగకుండా, ప్రజలుగా మన బాధ్యతను గుర్తించి ఇప్పటినుంచే విద్యుత్తును అత్యంత పొదుపుగా వాడటం అలవాటు చేసుకోవాలి.

1. ఇళ్లలో, కార్యాలయాల్లో అవసరం లేనప్పుడు లైట్లు, ఫ్యాన్లు వెంటనే ఆపివేయాలి.

2. అనవసరంగా ఏసీలు, గీజర్లు, ఎక్కువ విద్యుత్ కాలే పరికరాలను వాడటం తగ్గించాలి.

3. సహజ సిద్ధమైన వెలుతురు, గాలిని వినియోగించుకోవడానికి ప్రాధాన్యత ఇవ్వాలి.

4. మనం చేసే చిన్న పొదుపే రేపటి పెద్ద చీకట్ల నుంచి మనల్ని రక్షిస్తుంది. బాధ్యతాయుత పౌరులుగా మెలుగుదాం.. విద్యుత్ పొదుపు పాటించి సంక్షోభం నుంచి గట్టెక్కుదాం!

షేర్ చేయండి:

వ్యాఖ్యలు (Comments) (0)

ఇంకా వ్యాఖ్యలు లేవు. మొదటి వ్యాఖ్యను మీరే జోడించండి!

సంబంధిత వార్తలు (Related Updates)

NEWS BUZZ
© 2026 News Buzz సత్యం • నిర్భయం