NewsBuzz, Andrapradesh :- ఆంధ్రప్రదేశ్‌లో ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికలు జరిగే పరిస్థితి కనిపించడం లేదని వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి విమర్శించారు. రాజ్ భవన్ వద్ద రాష్ట్ర గవర్నర్‌ను కలిసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వం, ఎన్నికల కమిషన్ (SEC) తీరుపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.దేశంలోనే ఎక్కడా లేని విధంగా ప్రతిపక్ష అభ్యర్థులు నామినేషన్లు వేసే కనీస హక్కును కూడా భంగపరుస్తున్నారని ఆరోపించారు. ఎన్నికల్లో గెలుస్తామనే నమ్మకం లేకే అధికారంలో ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇలాంటి అరాచకాలకు ఒడిగడుతున్నారని పేర్కొన్నారు. నామినేషన్ ప్రక్రియలోనే పరిస్థితి ఇలా ఉంటే, రాబోయే రోజుల్లో సాధారణ ప్రజల పరిస్థితి ఏమిటని ఆయన ప్రశ్నించారు.
ఎన్నికలను పారదర్శకంగా, నిష్పక్షపాతంగా నిర్వహించాల్సిన రాష్ట్ర ఎన్నికల కమిషన్ (SEC) కూడా అధికార పార్టీతో లాలూచీ పడినట్లు స్పష్టంగా కనిపిస్తోందని విమర్శించారు. వ్యవస్థలు పక్షపాతంగా వ్యవహరిస్తున్నప్పుడు మౌనంగా ఉండటం సరికాదని, ఈ అక్రమాలు, దౌర్జన్యాలపై వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు, సామాన్య ప్రజలు ధైర్యంగా తిరగబడాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణ కోసం, స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎన్నికలు జరిపేలా చర్యలు తీసుకోవాలని గవర్నర్‌ను కోరినట్లు ఈ సందర్భంగా వైఎస్ జగన్ వెల్లడించారు.