NB
News Buzz యాప్‌లో చూడండి సులభమైన స్వైపింగ్ & లైవ్ అప్‌డేట్స్
యాప్ డౌన్‌లోడ్ చేయండి
29/11/2026
పోల్స్ (Polls)
హోమ్ రాజకీయం ఐక్యతతో ముందుకు సాగి స్థానిక ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పనిచేయాలి: పోట్ల గోవిందు

ఐక్యతతో ముందుకు సాగి స్థానిక ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పనిచేయాలి: పోట్ల గోవిందు

రాజకీయం By News Buzz Oct 19, 2026 85 Views
ఐక్యతతో ముందుకు సాగి స్థానిక ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పనిచేయాలి: పోట్ల గోవిందు

న్యూస్ బజ్ ,పుల్లలచెరువు :- స్థానిక సంస్థల (ఎంపీటీసీ) ఎన్నికలకు పార్టీ శ్రేణులంతా సమాయత్తమై, ఐక్యతతో ముందుకు సాగి విజయాన్ని ఖాయం చేసుకోవాలని తెలుగుదేశం పార్టీ పుల్లలచెరువు మండల అధ్యక్షుడు పోట్ల గోవిందు పిలుపునిచ్చారు.మండల కేంద్రంలోని రైస్ మిల్లు ప్రాంగణంలో టీడీపీ నాయకులు, కూటమి కార్యకర్తల ముఖ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన రాబోయే ఎంపీటీసీ ఎన్నికలకు సంబంధించి పార్టీ నాయకులు, కార్యకర్తలకు దిశా నిర్దేశం చేశారు.మండలంలోని 15 ఎంపీటీసీ స్థానాల్లో గ్రామాల వారీగా ఖరారైన రిజర్వేషన్లకు అనుగుణంగా అభ్యర్థులు తమ అవసరమైన సర్టిఫికెట్లు, నామినేషన్ పత్రాలను ముందస్తుగానే జాగ్రత్తగా సిద్ధం చేసుకోవాలని సూచించారు. పార్టీ శ్రేణులతో నిరంతరం సమన్వయం చేసుకుంటూ, గ్రామీణ స్థాయిలో పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు.

ఈ సమావేశంలో క్లస్టర్ ఇన్‌చార్జి కాకర్ల కోటయ్య, శనగ నారాయణరెడ్డి, మండల సీనియర్ నాయకులు రెంటపల్లి సుబ్బారెడ్డి, ప్రధాన కార్యదర్శి శనగ వెంకటేశ్వరరెడ్డి, గజ్వెలి భాస్కర్, మండల మాజీ అధ్యక్షుడు పయ్యావుల ప్రసాద్ పాల్గొన్నారు.

 అలాగే ముటుకుల సొసైటీ చైర్మన్ పావులూరి యోగయ్య, పుల్లలచెరువు సొసైటీ చైర్మన్ నారు వెంకట్రామిరెడ్డి, మేడికొండ లక్ష్మణ్, మండల బీజేపీ అధ్యక్షుడు నక్కా యోగేశ్వరరావు, పల్లపాటి బదరయ్య, మండల జనసేన పార్టీ అధ్యక్షుడు కొటారు అచ్చయ్యతో పాటు ఎన్డీయే కూటమికి చెందిన పలువురు నాయకులు, కార్యకర్తలు విశేష సంఖ్యలో హాజరయ్యారు.

షేర్ చేయండి:

వ్యాఖ్యలు (Comments) (0)

ఇంకా వ్యాఖ్యలు లేవు. మొదటి వ్యాఖ్యను మీరే జోడించండి!

సంబంధిత వార్తలు (Related Updates)

NEWS BUZZ
© 2026 News Buzz సత్యం • నిర్భయం