న్యూస్ బజ్ ,పుల్లలచెరువు :- పుల్లలచెరువు మండలం పి.వి. పల్లె గ్రామానికి చెందిన కాకర్ల వరలక్ష్మి కోటయ్య నాయుడుపాలెం–కొమరోలు MPTC స్థానానికి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా గురువారం నామినేషన్ దాఖలు చేశారు.ఈ నామినేషన్ కార్యక్రమానికి పుల్లలచెరువు మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పోట్ల గోవిందు గారు మరియు మండల సీనియర్ నాయకులు కాకర్ల కోటయ్య గారు హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ... తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల విజయానికి ప్రతి ఒక్క కార్యకర్త, నాయకుడు కలిసికట్టుగా కృషి చేసి, రాబోయే ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.