NewsBuzz, Telangana :- మరణాలను కూడా రాజకీయాల కోసం వాడుకోవడం బీఆర్‌ఎస్‌కే చెల్లుతుందని టీఆర్‌ఎస్ లీడర్ కవిత తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. గతంలో తమ మేనమామ చనిపోయినప్పుడు కేసీఆర్ రావడం చూసి తాను అక్కడి నుండి వెళ్ళిపోయానంటూ వైరల్ అయిన వీడియోపై ఆమె తాజాగా ఒక ఇంటర్వ్యూలో స్పందించారు.
కేటీఆర్ లేదా ఎవరో వస్తున్నారని తెలిసి అక్కడున్న మహిళలంతా అటూ ఇటూ అడ్జస్ట్ అయ్యామని కవిత వివరించారు. తండ్రి ఎదురుపడితే మాట్లాడనంత కోపం ఏమీ లేదని స్పష్టం చేసిన ఆమె, ఆ వీడియోను బీఆర్‌ఎస్ వాళ్లే కావాలనే వైరల్ చేశారని తీవ్రంగా మండిపడ్డారు. వ్యక్తిగత విషయాలను మరియు చావులను సైతం రాజకీయం చేయడం ఆ పార్టీకి అలవాటుగా మారిందని ఆమె ఆరోపించారు. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం రాజకీయ వర్గాలలో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.