న్యూస్ బజ్,పుల్లలచెరువు :- పుల్లలచెరువు మండలంలో కూటమి తరపున ఎంపీటీసీ, జడ్పీటీసీగా పోటీలో ఉన్న అభ్యర్థులను పరిచయం చేస్తూ, వారికి మద్దతుగా నిలిచి విజయానికి కృషి చేయాలని యర్రగొండపాలెం నియోజకవర్గ టీడీపీ ఇన్ చార్జ్ గూడూరి ఎరిక్షన్ బాబు కోరారు. వై. పాలెం లోని టీడీపీ కార్యాలయంలో పుల్లలచెరువు మండల జడ్పీటీసీ కూటమి అభ్యర్ధి గా పోటీచేస్తున్న కొఠారి అచ్చయ్యని పరిచయం చేస్తూ అచ్చయ్య విజయానికి మరియు ఎంపీటీసీలుగా పోటీ చేస్తున్న వారి విజయాలకు ప్రతి ఒక్కరు సహకరించాలని కోరారు.
కూటమి బలపరిచిన జనసేన పార్టీ జడ్పీటీసీ అభ్యర్ధి కొఠారి అచ్చయ్య కు గాజు గ్లాసు గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరారు.ప్రజల సంక్షేమం, గ్రామాల అభివృద్ధి, మెరుగైన మౌలిక సదుపాయాలే లక్ష్యంగా ముందుకు సాగుతున్న కూటమి అభ్యర్ధులకు ప్రజల ఆశీస్సులు, మద్దతు అందించాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో మండల అధ్యక్షులు పొట్ల గోవిందు , కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.