NB
News Buzz యాప్‌లో చూడండి సులభమైన స్వైపింగ్ & లైవ్ అప్‌డేట్స్
యాప్ డౌన్‌లోడ్ చేయండి
29/11/2026
పోల్స్ (Polls)
హోమ్ రాజకీయం పుల్లలచెరువులో త్రిముఖపోటీ.. ప్రచారంలో వేగం పెంచిన జడ్పీటీసీ అభ్యర్థులు

పుల్లలచెరువులో త్రిముఖపోటీ.. ప్రచారంలో వేగం పెంచిన జడ్పీటీసీ అభ్యర్థులు

రాజకీయం By News Buzz Oct 30, 2026 169 Views
పుల్లలచెరువులో త్రిముఖపోటీ.. ప్రచారంలో వేగం పెంచిన జడ్పీటీసీ అభ్యర్థులు

న్యూస్ బజ్ ,పుల్లలచెరువు :- పుల్లలచెరువు మండలంలో ఎన్నికల్లో పోటీ చేస్తున్న మూడు పార్టీల జడ్పిటిసి అభ్యర్థులు ఎన్నికల ప్రచారంలో దూసుకు వెళ్తున్నారు. జనసేన పార్టీ నుంచి ఆ పార్టీ మండల కన్వీనర్ కొటారి అచ్చయ్య, వైసిపి నుండి నాయుడుపాలెం మాజీ సర్పంచ్ ఆవుల కోటి వీరారెడ్డి, సిపిఐ పార్టీ నుంచి ఆ పార్టీ మండల కార్యదర్శి గోపవరపు గురునాథం పోటీలో ఉన్నారు. మూడు పార్టీల అభ్యర్థులు ప్రజలకు హామీల వర్షం కురిపిస్తూ ప్రజా సమస్యల పరిష్కారానికి, ఈ ప్రాంత రైతాంగ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామంటూ హామీల వర్షం కురిపిస్తున్నారు. శుక్రవారం మూడు పార్టీల ప్రధాన నాయకులు,కార్యకర్తలు ఆయా గ్రామాల్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. నవంబర్ 5 న పోలింగ్ జరగనుండగా మరి ఓటరు నాడి ఎలా ఉందో మరికొద్ది రోజుల్లోనే తేలనుంది. మరోవైపు ఎన్నికల అధికారులు జరుగుతున్న ప్రచార పర్వాన్ని క్షుణ్ణంగా పరిశీలన చేస్తున్నారు. నిబంధనల మేరకు ఆయా పార్టీల అభ్యర్థులు ప్రచారం నిర్వహించుకోవాలని నిబంధనలను మీరితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. నిబంధనలపై ఎన్నికల కమిషన్ స్థానిక అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ప్రధాన పార్టీల అభ్యర్థులు నిబంధనల మేరకు ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. మరి వీరిలో ఎవరు విజయం సాధిస్తారో అనేది మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. 

షేర్ చేయండి:

వ్యాఖ్యలు (Comments) (0)

ఇంకా వ్యాఖ్యలు లేవు. మొదటి వ్యాఖ్యను మీరే జోడించండి!

సంబంధిత వార్తలు (Related Updates)

NEWS BUZZ
© 2026 News Buzz సత్యం • నిర్భయం