మార్కాపురం :- నూతనంగా ఏర్పడిన మార్కాపురం జిల్లా పరిషత్ (జడ్పీ) తొలి చైర్మన్‌గా ఎన్నికైన కందుల రామిరెడ్డి , వైస్ చైర్మన్‌గా ఎన్నికైన శ్రీనివాస్ వర్మను తెలుగుదేశం పార్టీ నాయకులు ఘనంగా సన్మానించి, హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు.
తెలుగుదేశం పార్టీ తరఫున అత్యంత ప్రతిష్టాత్మకమైన జిల్లా పరిషత్ చైర్మన్, వైస్ చైర్మన్ పదవులకు కందుల రామిరెడ్డి, శ్రీనివాస్ వర్మలు ఎన్నికవ్వడం పట్ల పుల్లలచెరువు మండల టీడీపీ శ్రేణుల్లో ఆనందోత్సాహాలు వెల్లివిరిశాయి. ఈ సందర్భంగా పుల్లలచెరువు మండల పార్టీ అధ్యక్షులు పోట్ల గోవిందు, ఎంపీపీ కాకర్ల కోటయ్య , సీనియర్ నాయకులు ఉప్పల అనుమంతు , పల్లపాటి భద్రయ్య, మరియు సిద్ధనపాలెం సుబ్బారావు మర్యాదపూర్వకంగా కందుల రామిరెడ్డి గారిని, శ్రీనివాస్ వర్మ గారిని కలిశారు.
ఈ సందర్భంగా నాయకులందరూ నూతన జడ్పీ చైర్మన్ కందుల రామిరెడ్డి , వైస్ చైర్మన్ శ్రీనివాస్ వర్మ పుష్పగుచ్ఛాలు అందజేసి, శాలువాలతో ఘనంగా సత్కరించారు. నూతన జిల్లాగా రూపుదిద్దుకున్న మార్కాపురం ప్రాంత సమగ్రాభివృద్ధికి వీరిద్దరి నాయకత్వం ఎంతో దోహదపడుతుందని నాయకులు ఈ సందర్భంగా ఆశాభావం వ్యక్తం చేశారు.
అనంతరం మండల నాయకులు మాట్లాడుతూ.. ప్రజాసేవలో మరింత ఉన్నతంగా రాణిస్తూ, ప్రభుత్వం అమలు చేసే సంక్షేమ మరియు అభివృద్ధి కార్యక్రమాలను క్షేత్రస్థాయిలో అర్హులైన ప్రతి ఒక్కరికీ అందేలా కృషి చేయాలని కోరారు. ముఖ్యంగా వెనుకబడిన మార్కాపురం ప్రాంతాన్ని అభివృద్ధి పథంలో ముందుకు నడిపించడంలో నూతన జడ్పీ పాలకవర్గం కీలక పాత్ర పోషించాలని ఆకాంక్షించారు.
తమను కలిసి సన్మానించి, శుభాకాంక్షలు తెలిపిన పుల్లలచెరువు మండల పార్టీ అధ్యక్షులు పోట్ల గోవిందు, ఎంపీపీ కాకర్ల కోటయ్య మరియు ఇతర నాయకులకు జడ్పీ చైర్మన్ కందుల రామిరెడ్డి, వైస్ చైర్మన్ శ్రీనివాస్ వర్మలు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. జిల్లా అభివృద్ధికి అందరి సహకారంతో పాటుపడి పనిచేస్తామని వారు హామీ ఇచ్చారు.