NB
News Buzz యాప్‌లో చూడండి సులభమైన స్వైపింగ్ & లైవ్ అప్‌డేట్స్
యాప్ డౌన్‌లోడ్ చేయండి
29/11/2026
పోల్స్ (Polls)
హోమ్ ఆసక్తికరమైన నిజాలు విశాఖ ఆర్కే బీచ్‌లో అలల బీభత్సం: ఏలూరు కుటుంబం ప్రాణాలు కాపాడిన జీవీఎంసీ స్విమ్మర్ల సాహసం

విశాఖ ఆర్కే బీచ్‌లో అలల బీభత్సం: ఏలూరు కుటుంబం ప్రాణాలు కాపాడిన జీవీఎంసీ స్విమ్మర్ల సాహసం

ఆసక్తికరమైన నిజాలు By News Buzz Oct 15, 2026 54 Views
విశాఖ ఆర్కే బీచ్‌లో అలల బీభత్సం: ఏలూరు కుటుంబం ప్రాణాలు కాపాడిన జీవీఎంసీ స్విమ్మర్ల సాహసం

న్యూస్ బజ్,విశాఖపట్నం :- పర్యాటకుల తాకిడితో నిత్యం కళకళలాడే విశాఖపట్నంలోని ప్రసిద్ధ రామకృష్ణ (ఆర్కే) బీచ్‌లో మరోసారి సముద్రపు అలల ఉద్ధృతి తీవ్ర కలకలం రేపింది. ఈ ప్రమాదంలో ఏలూరు నుంచి విహారయాత్ర నిమిత్తం విశాఖకు వచ్చిన ఒకే కుటుంబానికి చెందిన నలుగురు సభ్యులు సముద్రంలో చిక్కుకోగా, జీవీఎంసీ (గ్రేటర్ విశాఖపట్నం మునిసిపల్ కార్పొరేషన్) లైఫ్‌గార్డ్ స్విమ్మర్లు అత్యంత సమయస్ఫూర్తితో వ్యవహరించి వారి ప్రాణాలను కాపాడారు.

ఘటన వివరాలు

పోలీసులు మరియు ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం, ఏలూరు పట్టణానికి చెందిన ఒక కుటుంబం సరదాగా గడపడానికి ఆర్కే బీచ్‌కి చేరుకుంది. ఉత్సాహంగా సముద్రపు ఒడ్డున ఇసుకలో తిరుగుతూ కెరటాలను ఆస్వాదిస్తున్న క్రమంలో, ఒక్కసారిగా ఊహించని రీతిలో భారీ అలలు ఎగసిపడ్డాయి. ఈ ఉద్ధృతమైన అలల తాకిడికి ఆ కుటుంబ సభ్యులు సముద్రం లోపలికి లాగబడ్డారు.నిమిషాల వ్యవధిలోనే అలల తీవ్రత పెరగడంతో వారు నీటిలో కొట్టుకుపోతూ సహాయం కోసం కేకలు వేశారు. ఇది గమనించిన స్థానికులు మరియు ఇతర పర్యాటకులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.

  అదే సమయంలో బీచ్‌ వద్దే విధుల్లో ఉన్న జీవీఎంసీకి చెందిన లైఫ్‌గార్డ్ స్విమ్మర్లు క్షణం కూడా ఆలస్యం చేయకుండా అప్రమత్తమయ్యారు. ప్రాణాలకు తెగించి సముద్రపు రాక్షస అలలను సైతం లెక్కచేయకుండా వారు సముద్రంలోకి దూకారు.సముద్రం లోపల అలల తాకిడికి అల్లలాడిపోతున్న కుటుంబ సభ్యుల దగ్గరకు ఈత కొంటూ చేరుకున్నారు. ప్రాణభయంతో మునిగిపోతున్న వారిని ఒక్కొక్కరిగా ఒడ్డుకు చేర్చే ప్రయత్నం చేశారు. లైఫ్‌గార్డ్స్ చూపిన అంకితభావం, అద్భుతమైన ఈత నైపుణ్యంతో ఆ కుటుంబంలోని వారందరినీ ప్రాణాపాయం నుండి సురక్షితంగా ఒడ్డుకు తీసుకువచ్చారు. సమయస్ఫూర్తితో వ్యవహరించి నలుగురు ప్రాణాలను కాపాడిన జీవీఎంసీ స్విమ్మర్ల సాహసాన్ని బీచ్‌ వద్ద ఉన్న పర్యాటకులు, స్థానికులు అమితంగా ప్రశంసించారు. అధికారులతో పాటు పలువురు ప్రముఖులు కూడా స్విమ్మర్ల ధైర్యసాహసాలను అభినందించారు. సకాలంలో స్పందించకపోతే పెను ప్రమాదం జరిగి ఉండేదని, ప్రాణనష్టం తప్పిందని స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.

 

అధికారుల హెచ్చరికలు... ఈ ఘటన నేపథ్యంలో విశాఖ అధికారులు మరియు పర్యాటక శాఖ మరోసారి కీలక హెచ్చరికలు జారీ చేశారు.ఆర్కే బీచ్‌తో పాటు సాగర సంగమ ప్రాంతాల్లో సముద్రం ఎప్పుడూ ప్రమాదకరంగా మారుతుంటుందని తెలిపారు.అలల ఉద్ధృతి ఎక్కువగా ఉన్నప్పుడు, ముఖ్యంగా అలలు ఉప్పొంగుతున్న సమయాల్లో పర్యాటకులు ఎట్టి పరిస్థితుల్లోనూ సముద్రంలోకి దిగవద్దని హెచ్చరించారు.బీచ్‌లలో ఏర్పాటు చేసిన హెచ్చరిక బోర్డులను, లైఫ్‌గార్డ్స్ సూచనలను ప్రతి ఒక్కరూ తూచా తప్పకుండా పాటించాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.

షేర్ చేయండి:

వ్యాఖ్యలు (Comments) (0)

ఇంకా వ్యాఖ్యలు లేవు. మొదటి వ్యాఖ్యను మీరే జోడించండి!

సంబంధిత వార్తలు (Related Updates)

NEWS BUZZ
© 2026 News Buzz సత్యం • నిర్భయం